Latest News

పవర్ హక్కుల్ని ‘పవర్’ ఫుల్ రేటుకు అమ్ముడు పోయిందా!


రవితేజ నటిస్తున్న ‘‘పవర్’’ సినిమా హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు మార్కెట్ లో అప్పుడే వ్యాపారం మొదలైందని సమాచారం! ఎలాగైనా ఈ సినిమాను దక్కించుకోవాలనే పట్టుదలతో బయ్యర్లు వెంటపడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం శాటిలైట్ హక్కుల్ని దాదాపు రూ.7.50 కోట్లకు జెమినీ టీవీ కొనుగోలు చేసిందని ఫిల్మ్ నగర్ సమాచారం! రవితేజ కెరీర్ లోనే శాటిలైట్ రైట్స్ పవర్ ఫుల్ రేటుకు అమ్ముడుపోయాయని చిత్రపరిశ్రమలో జోరుగా వార్తలొస్తున్నాయి.

‘‘పవర్’’ సినిమాకు సంబంధించి గతంలో రిలీజైన టీజర్ లో రవితేజ ఒక పోలీసు అధికారి పాత్రలో చెప్పిన డైలాగులు అదిరిపోయే రేంజులో వున్నాయని ప్రతిఒక్కరి నుంచి విశేష స్పందన లభించింది. టీజర్ విడుదలైన ఒక వారంరోజుల్లోనే దాదాపు 6లక్షలకు పైగా నెటిజన్లు దీనిని వీక్షించడం విశేషం! ఈ కారణాల వల్లే మార్కెట్ వర్గాలు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. పైగా శాటిలైట్ రైట్స్ కూడా భారీగా అమ్ముడుపోవడం వల్ల ఈ సినిమా ఖచ్చితంగా భారీ హిట్ కొడుతుందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.

‘‘పవర్’’ సినిమాలో రవితేజ సరసన హన్సిక కథానాయికగా నటిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఛేజింగ్ సన్నివేశాలను బ్యాంకాక్ లో తెరకెక్కిస్తున్నారు. ఆ షెడ్యూల్ పూర్తయితే దాదాపు సినిమా మొత్తం ముగిసినట్టేనని… త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో దర్శకనిర్మాతలు పడిపోయారు.