Latest News

మాస్ పవర్ చూపించనున్న రవితేజ


బలుపు వంటి హిట్ తర్వాత ఆ చిత్ర కథకుడు బాబి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం '' పవర్ '' . రవితేజ సరసన అందాల బొద్దుగుమ్మ హన్సిక కథానాయికగా నటిస్తుండగా రెజీనా మరో నాయికగా నటిస్తోంది.ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రేపటి నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన తీజర్ దుమ్మురేపింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం లో రవితేజ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.