Latest News

రవితేజలోని పవర్ చూపిస్తాను



మాస్ మహారాజ రవితేజ ‘బలుపు’ సినిమాకి రైటర్ గా పనిచేసి రవీంద్రనాథ్ అలియాస్ బాబీ ఆ తర్వాత దర్శకుడిగా మారి రవితేజతో ‘పవర్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో రవితేజకి మరో హిట్ ఇవ్వడానికి సిద్దమయిన బాబీ 

బాబీ గారి గురించి 

బాబీ నేటివ్ ప్లేస్ గుంటూరు. చిన్నప్పటి నుంచి స్కూల్ కి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్ళిన బాబీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి హైదరాబాద్ వచ్చాడు.తన కెరీర్ ఎలా మొదలైంది అనే విషయాన్ని గురించి చెబుతూ ‘నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ‘స్వాతి ముత్యం’ సినిమాలో జాబు కోసం కమల్ హాసన్ రోజూ సోమయాజులు చుట్టూ తిరిగిన విధంగా నేను రైటర్ చిన్ని కృష్ణ గారి ఇంటి చుట్టూ తిరిగాను. అప్పట్లో ఆయన ఇంద్ర సినిమాతో హిట్ అందుకొని ఉన్నారు. ఒక 20 రోజుల తర్వాత చిన్ని కృష్ణ గారు నన్ను పిలిచి ఒక సీన్ ఇచ్చి డెవలప్ చేయమన్నారు. అది గంగోత్రి సినిమాలోనిది. ఆయన నన్ను ఒక ఆప్షన్ ఇమ్మంటే నేను డెవలప్ చేసి మూడు ఆప్షన్స్ ఇచ్చాను. అది నచ్చడంతో గంగోత్రి నుండి ఆయనతో మొదలైన జర్నీ బద్రినాథ్ వరకూ కొనసాగింది. ఆ తర్వాత ఆదినారాయణ, కోన వెంకట్ గారి రైటర్స్ దగ్గర పనిచేసాను. వారి దగ్గర నుంచి డైరెక్షన్ ఎలా చెయ్యాలి అనే దానికంటే సినిమా ఫీల్డ్ గురించి చాలా నేర్చుకున్నానని’ బాబీ అన్నాడు.


New Working Stills : http://goo.gl/zYI7mq

Movie Stills : http://goo.gl/zLlFFH

Movie Posters : http://goo.gl/HYBdh0